Bhagwant Mann : పంజాబ్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు సీఎం భగవంత్ మాన్. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇది పిరికిపందలు చేసే చర్యగా అభివర్ణించారు. మరో వైపు భగవంత్ మాన్(Bhagwant Mann) సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులను ఆదేశించారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు సీఎం.
ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై ఆర్పీజీ తరహా దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వాతావరణాన్ని పాడు చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినా తప్పించు కోలేరని హెచ్చరించారు.
దోషులు ఎవరో త్వరలో తేలుతుందని స్పష్టం చేశారు భగవంత్ మాన్. కావాలని పంజాబ్ లో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు యత్నిస్తున్నారు. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు.
తమ ప్రయారిటీ ప్రజా సంక్షేమం అని పేర్కొన్నారు. పిరికిపందలు మాత్రమే ఇలాంటి ఘటనలకు పాల్పడతారని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమమని పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఏరి పారేస్తామని హెచ్చరించారు.
దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు భగవంత్ మాన్. పేలుడు ఘటనలో రాకెట్ తో నడిచే గ్రెనేడ్ లేదా ఆర్పీజీ పేలిందన్నారు. కాగా పేలుడు ఘటన చిన్నదేనని పేర్కొన్నారు పోలీసులు.
ఇదిలా ఉండగా పంజాబ్ పేలుడుపై ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు సీఎం భగవంత్ మాన్.
Also Read : భగవంత్ మాన్ గ్రేట్ లీడర్ – సిద్దూ