Bhagwant Mann : కేంద్ర స‌ర్కార్ తీరుపై మాన్ క‌న్నెర్ర‌

పోరాటం త‌ప్ప‌ద‌ని సీఎం ప్ర‌క‌ట‌న

Bhagwant Mann  : కేంద్ర ప్ర‌భుత్వంపై పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann )సీరియ‌స్ అయ్యారు. పంజాబ్ రాష్ట్ర ప‌రిధులు, ప‌రిమితుల విష‌యంలో జోక్యం చేసుకుంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

చండీగ‌ఢ్ ప‌రిపాల‌న‌లో ఇత‌ర రాష్ట్రాలు, సేవ‌ల‌కు చెందిన అధికారులు, సిబ్బందిని విధించ‌డం ద్వారా కేంద్ర స‌ర్కార్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం 1966ను ఉల్లంఘించిందంటూ ఆరోపించారు సీఎం.

చండీగ‌ఢ్ పై హ‌క్కు కోసం పంజాబ్ పోరాటం చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మాన‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కేంద్ర పాలిత ప‌రిపాల‌న‌లోని ఉద్యోగుల‌కు అందించ‌డంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్ర‌క‌ట‌న‌పై నిప్పులు చెరిగారు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann ).

పంజాబ్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం 1966ని ఉల్లంఘించందంటూ ఫైర్ అయ్యారు. కేంద్ర స‌ర్కార్ చండీగ‌ఢ్ ప‌రిపాల‌న‌లో ఇత‌ర రాష్ట్రాలు, సేవ‌ల‌కు చెందిన అధికారుల‌ను , సిబ్బందిని ద‌శ‌ల వారీగా విధిస్తోంద‌ని ఆరోపించారు.

ఇది ప్ర‌జాస్వామ్య స్పూర్తికి పూర్తిగా విరుద్ద‌మ‌ని మండిప‌డ్డారు భ‌గ‌వంత్ మాన్. ఇందుకు అవ‌స‌ర‌మైతే కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. కేంద్ర మంత్రి (Union Minister) ప్ర‌క‌ట‌నపై ఆప్ , ప్ర‌తిప‌క్ష అకాళీద‌ళ్ , కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిప‌డ్డాయి.

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) సాధిస్తున్న విజ‌యాల‌ను చూసి త‌ట్టుకోలేక పోతుంద‌ని ఆరోపించారు ఆప్ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా.

2017 నుంచి 2022 వ‌ర‌కు పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ ఎప్పుడైతే ఆప్ ప‌వ‌ర్ లోకి వ‌చ్చే స‌రికి చండీగ‌ఢ్ సేవ‌ల‌ను తొల‌గించారంటూ మండిప‌డ్డారు.

Also Read : మంత్రి ముఖేష్ పై సీఎం నితీష్ వేటు

Leave A Reply

Your Email Id will not be published!