Bhagwant Mann : భారత దేశం గర్వించదగిన నాయకులలో అంబేద్కర్ ఒకరు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు ఈ దేశం కోసం ఉరి కొయ్యలను ముద్దాడిన భగత్ సింగ్ అంటే అభిమానం.
షహీద్ తో పాటు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ అంటే ప్రాణం. అందుకే భగవంత్ మాన్(Bhagwant Mann) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఇక నుంచి సీఎం ఫోటో కానీ ప్రధానమంత్రి ఫోటో కానీ ఉండేందుకు వీలు లేదని ఆదేశించాడు.
రాజ్ భవన్ లో కాకుండా కొంగర్ కలాన్ లో ప్రమాణం చేశాడు. కేవలం భగత్ సింగ్ , అంబేద్కర్ ఫోటోలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశాడు. తాను ఈ స్థితికి రావడానికి ఒకరు షహీద్ అయితే మరికొందరు బాబా సాహెబ్ అని ప్రతిసారి చెబుతూ వస్తారు భగవంత్ మాన్.
ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం. జయంతిని పురస్కరించుకుని జలంధర్ లో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని చేపట్టారు. భగవంత్ మాన్ హాజరయ్యారు.
1951లో అంబేద్కర్ ప్రసంగించిన పార్క్ లో దీనిని ఏర్పాటు చేయడం విశేషం. అదే ఏడాది అక్టోబర్ 27న బూటా మండిలో ఉన్న పార్కులో అంబేద్కర్ లక్షలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.
భగత్ సింగ్ కన్న కలల్ని సాకారం చేస్తామని ఇంతకు ముందే ప్రకటించారు మాన్. అదే సమయంలో బాబా సాహెబ్ చూపిన బాటలోనే తాము నడుస్తామని వెల్లడించారు.
అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. అంబేద్కర్ గనుక రాజ్యాంగాన్ని రాయక పోయి ఉండి ఉంటే తాము ఇవాళ గొంతు విప్పే వాళ్లం కాదన్నారు.
Also Read : మంత్రులకు షాక్ అధికారులకు ఝలక్