Bhagwant Mann : పంజాబ్ లో నువ్వా నేనా అన్న రీతిలో పోరాటానికి తెర పడింది. ఇవాళ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
ఈసారి గతంలో లేని రీతిలో భారీ పోటీదారుగా మారింది ఆమ్ ఆద్మీ పార్టీ. ముందస్తుగానే ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీకి చెందిన డైనమిక్ లీడర్, ఎంపీ అయిన భగవంత్ మాన్ (Bhagwant Mann)ను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.
ఆయన నిత్యం మద్యం మత్తులో ఉంటాడన్న అపప్రద ఉంది. ప్రధానంగా పంజాబ్ లో కాంగ్రెస్ వర్సెస్ ఆప్ గా మారి పోయింది. తాజాగా సీఎం అభ్యర్థిగా ఉన్న భగవంత్ మాన్ (Bhagwant Mann)ఇప్పటికే ఆప్ ఎంపీగా ఉన్నారు.
ఆ పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలతో పాటు 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి భగవంత్ మాన్ తన స్వంత గడ్డ అయిన సంగ్రూర్ లోని ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున ఎమ్మెల్యే బరిలో ఉన్నారు.
కాగా భగవంత్ మాన్ పంజాబ్ చీఫ్ గా ఉన్నాడు. అంతే కాదు రాష్ట్రంలోని సంగ్రూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రజల్లో మంచి పట్టుంది.
ఇదిలా ఉండగా ఈ ధురి నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. ఆ పార్టీకి చెందిన దల్వీందర్ సింగ్ ఖంగురా గోల్డీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.
వాస్తవానికి ఈనెల 14నే పోలింగ్ జరగాల్సి ఉంది పంజాబ్ లో. కానీ సిక్కుల ఆరాధ్య దైవంగా భావించే సద్గురు రవిదాస్ జయంతి ఉండడంతో పోలింగ్ తేదీని ఈనెల 20కి మార్చింది కేంద్ర ఎన్నికల సంఘం.
Also Read : దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ కలకలం