Bhagyalaxmi Temple : భాగ్యలక్ష్మి దర్శనం శుభప్రదం
కోరిన కోర్కెలు తీర్చే దేవతగా గుర్తింపు
Bhagyalaxmi Temple : హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారికి విశిష్టమైన చరిత్ర ఉంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో ఈ గుడికి పదే పదే వెళ్లే వారు. ఆ తర్వాత బీజేపీ ప్రముఖులు ఇక్కడికి రావడం పరిపాటిగా మారింది. తాజాగా బీజేపీ చీఫ్ గా నియమితులైన జి. కిషన్ రెడ్డి ఇవాళ అమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మ వారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.
Bhagyalaxmi Temple Hyderabad
చార్మినార్ కు పక్కనే ఉంది ఈ గుడి. ప్రస్తుతం చార్మినార్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉంది. లక్ష్మి దేవికి అంకితం చేయబిన ఆలయాన్ని హిందూ ట్రస్ట్ నిర్వహిస్తుంది. 1960లో అమ్మ వారిని ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. 2013లో ఆలయ నిర్మాణాన్ని అనధికార నిర్మాణంగా ప్రకటించింది.
ఆనాడు రజాకర్లు హైదరాబాద్ ప్రావిన్స్ ను షరియా ప్రభావంతో ఇస్లామిక్ స్టేట్ గా మార్చాలని ప్రయత్నం చేశారు. కానీ అసమ్మతి పౌరులు స్థానిక దేవత భాగ్యలక్ష్మి(Bhagyalaxmi Temple) ఉన్న స్థలాన్ని భాగ్యనగర్ గా గుర్తించారు. కులీ కుతుబ్ షాహీల వరకు ఇక్కడ పవిత్రమైన రాయిని దేవతగా భావించి కొలిచారు. ఆర్టీసీ బస్సు రాయిని ఢీకొంది. దీంతో అక్కడ రాయి స్థానంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చార్మినార్ , భాగ్యలక్ష్మి ఆలయం సమ్మిళిత సంస్కృతికి ప్రతిబింబంగా భావిస్తారు.రాణి భాగమతి జ్ఞాపకార్థం ఈ మందిరాన్ని కొలుస్తారు.
Also Read : G Kishan Reddy : భాగ్యలక్ష్మి గుడిలో కిషన్ రెడ్డి పూజలు