Bhaichung Bhutia : అవినీతి..హింస లేని ప్రభుత్వం కావాలి
మాజీ ఫుట్ బాల్ స్టార్ బైచుంగ్ భూటియా
Bhaichung Bhutia : భారత్ కు చెందిన మాజీ ఫుట్ బాల్ స్టార్ బైచుంగ్ భూటియా(Bhaichung Bhutia) సంచలన కామెంట్స్ చేశారు. సిక్కిం సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నేరాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భారీ అవినీతి పేరుకు పోయిందని ఆరోపించారు భూటియా. వ్యవస్థీకృత రాజకీయ హింస పెరిగిందన్నారు. సిక్కిం ప్రజలు స్వచ్ఛమైన పాలన కోసం ఆరాట పడుతున్నారని చెప్పారు. పేలవమైన పాలనతో ప్రజలు విసిగి పోయారని ఆవేదన చెందారు.
గ్యాంగ్ టక్ లో బైచుంగ్ భూటియా మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీలో ఎన్నికలు జరగనున్నాయి. అవినీతి, హింస రహిత ప్రభుత్వం కోసం సిక్కింలోని హిమాలయ ప్రాంత వాసులు ఆకాంక్షిస్తున్నారని స్పష్టం చేశారు. ఫుట్ బాల్ క్రీడాకారుడిగా మారిన రాజకీయవేత్త సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. హమ్రో సిక్కిం పార్టీని ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో చోటు చేసుకున్న సమస్యలపై తమ పార్టీ మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డిమోక్రటిక్ ఫ్రంట్ తో కలిసి పని చేస్తోందని చెప్పారు బైచుంగ్ భూటియా(Bhaichung Bhutia). 371ఎఫ్ ఇది సిక్కిమ్ ప్రజలకు భూమి యాజమాన్యంపై నిర్దిష్ట హక్కులను అందజేస్తుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ ని ప్రవేశ పెట్టడం ప్రధాన డిమాండ్ ఇరు పార్టీలు చేతులు కలిపినట్లు తెలిపారు.
Also Read : మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త