Bharat Biotech Prices : ఇంట్రా నాస‌ల్ వ్యాక్సిన్ల ధ‌ర‌లు ప్రియం

ప్ర‌క‌టించిన భార‌త్ బ‌యోటెక్

Bharat Biotech Prices : ప్ర‌ముఖ ఫార్మా త‌యారీ సంస్థ భార‌త్ బ‌యో టెక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. చైనాలో క‌రోనా తీవ్ర స్థాయిలో కొన‌సాగుతోంది. రోజుకు వేలాది మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. దీంతో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఇందులో భాగంగా ముక్కు ద్వారా వ్యాక్సిన్ల‌ను ఇచ్చేందుకు గాను దానిని త‌యారు చేసిన భార‌త్ బ‌యో టెక్ కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

దీంతో ఆయా వ్యాక్సిన్ల‌కు సంబంధించిన ధ‌ర‌ల‌ను ఇవాళ కంపెనీ ప్ర‌క‌టించింది. దీని ధ‌ర‌లు చూస్తేనే క‌ళ్లు బైర్లు క‌మ్మేలా ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా త‌యారు చేసిన నాస‌ల్ వ్యాక్సిన్లు వ‌చ్చే ఏడాది 2023 జ‌న‌వ‌రి నాలుగో వారం నుండి అందుబాటులోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది భార‌త్ బ‌యోటెక్.

దీనిని బూస్ట‌ర్ డోస్ గా వాడాల‌ని కేంద్రం ఇప్ప‌టికే తెలిపింది. ఇక సంస్థ త‌న కోవిడ్ -19 ఇంట్రా నాస‌ల్ వ్యాక్సిన్ ఇన్ కోవాక్ తో పాటు కోవిన్ అందుబాటులో ఉంద‌ని పేర్కొంది. ఇక ప్రైవేట్ మార్కెట్ లో అయితే జీఎస్టీ మినహాయించి ఒక్క వ్యాక్సిన్ కు రూ. 800 , ప్ర‌భుత్వానికి అయితే రూ. 325గా నిర్ణ‌యించిన‌ట్లు భార‌త్ బ‌యో టెక్(Bharat Biotech Prices)  చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది.

ఇదిలా ఉండ‌గా క‌రోనా వ్యాధి నివార‌ణ‌కు సంబంధించి ప్ర‌పంచంలోనే మొట్ట మొద‌టి ఇంట్రా నాస‌ల్ వ్యాక్సిన్ ఇదే కావ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా భార‌త్ బ‌యో టెక్ లిమిటెడ్ చైర్మ‌న్ ఎల్లా కృష్ణ మాట్లాడుతూ రెండు వేరియంట్ ల‌లో త‌యారు చేశామ‌న్నారు.

Also Read : క‌రోనాపై యుద్దం ఎదుర్కొనేందుకు సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!