Bharat Jodo Yatra : జోడో యాత్ర 14న ఏపీలో 24న తెలంగాణ‌లో

ప్ర‌క‌టించిన పార్టీ మీడియా చీఫ్ జైరాం ర‌మేష్

Bharat Jodo Yatra : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి ప్రారంభ‌మైంది. కేర‌ళ‌లో ముగించుకుని ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క రాష్ట్రంలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ గురువారం జోడో యాత్ర‌లో పాల్గొనున్నారు.

ఇదే స‌మ‌యంలో భార‌త్ జోడో యాత్ర అక్టోబ‌ర్ 14న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అక్టోబ‌ర్ 24న తెలంగాణ‌లో ప్ర‌వేశించ‌నుంది. ఈ యాత్ర అనంత‌పురం జిల్లా ఓబుళాపురం మీదుగా రాష్ట్రంలోకి ప్ర‌వేశించ‌నుంది. డి హీరేహాల్ – ఓబుళాపురం మ‌ధ్య రాహుల్ గాంధీ 8 కిలో మీట‌ర్ల నుంచి 10 కిలోమీట‌ర్ల వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు.

మ‌రుస‌టి రోజు బ‌ళ్లారిలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ (ఏఐసీసీ) అధ్య‌క్ష ఎన్నిక‌లు ఈనెల 17న జ‌ర‌గ‌నున్నాయి. ఇందు కోసం అక్టోబ‌ర్ 16, 17న యాత్ర‌ను నిలిపి వేస్తారు. దేశ వ్యాప్తంగా మొత్తం 9,000 వేల మంది స‌భ్యులు పార్టీ చీఫ్ ఎన్నిక‌ల్లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకుంటారు. ఏ

పీలో యాత్ర ముగిసిన అనంత‌రం భార‌త్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) అక్టోబ‌ర్ 24న తెలంగాణ‌లోకి ప్ర‌వేశిస్తుంది. ఈ మేర‌కు రోడ్ మ్యాప్ సిద్దం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఔట‌ర్ రింగ్ రోడ్డు వికారాబాద్ మీదుగా ప్లాన్ చేసింది.

ఇందులో భాగంగా అఫ్జ‌ల్ గంజ్ , మొజాం జాహీ మార్కెట్ , గాంధీ భ‌వ‌న్ , నాంప‌ల్లి ద‌ర్గా, విజ‌య్ న‌గ‌ర్ కాల‌నీ, నాగార్జున స‌ర్కిల్ , పంజాగుట్ట‌, అమీర్ పేట్ , కూక‌ట్ ప‌ల్లి, మియాపూర్ , పటాన్ చెరు మీదుగా సాగుతుంది.

Also Read : మైసూరుకు చేరుకున్న సోనియా గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!