Bhatti Vikramarka : డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క
ప్రమాణ స్వీకారం చేసిన మల్లు
Bhatti Vikramarka : హైదరాబాద్ – 10 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు సీఎం తో డిప్యూటీ సీఎం , కేబినెట్ ను ఏర్పాటు చేసింది ఏఐసీసీ హైకమాండ్. ఇప్పటికే అతిరథ మహారథులంతా హైదరాబాద్ కు విచ్చేశారు.
Bhatti Vikramarka As a Deputy CM
ఈ దేశంలో తాజాగా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే . కేవలం ఒకే ఒక్క తెలంగాణలో తిరిగి ఊపిరి పోసుకుంది. ఈ క్రెడిట్ అంతా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) డిప్యూటీ సీఎంగా ప్రకటించింది కాంగ్రెస్ హై కమాండ్.
రేవంత్ రెడ్డితో కలుపుకుని పార్టీ ప్రముఖులు 12 మందిని ఎంపిక చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన అనుభవాన్ని ప్రాతిపదికగా చేసుకుని మంత్రులను ఖరారు చేశారు. తనను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసినందుకు గాను మల్లు భట్టి విక్రమార్క ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ,, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణు గోపాల్ కు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Gaddam Prasad Kumar : స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్