Bhatti Vikramarka : ప్రజా తీర్పు సుస్పష్టం – భట్టి
గెలుపొందిన వారికి కంగ్రాట్స్
Bhatti Vikramarka : మధిర – సీఎల్పీ నేత మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఘన విజయాన్ని సాధించారు. వరుసగా ఇదే నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. తాజాగా గెలుపొందిన అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని సాధించేలా కట్ట బెట్టినందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నాలుగున్నర కోట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు.
Bhatti Vikramarka Comment
ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే దిశగా ఫలితాలు కట్ట బెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). ప్రజా తీర్పు కు కట్టుబడి ఉంటామని స్పస్టం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు వివేక్ బ్రదర్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేయడం ఆనందంగా ఉందన్నారు.
తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తమ పార్టీ హైకమాండ్ కు , పర్యటించి ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క.
మొత్తంగా దొర అహంకారానికి సరైన గుణపాఠం చెప్పారంటూ పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇచ్చిన మాట ప్రకారం జాబ్స్ భర్తీ చేస్తామని చెప్పారు.
Also Read : Revanth Reddy : కొడంగల్ గడ్డకు నమస్కరిస్తున్నా