Bhatti Vikramarka : కార్మికుల సంక్షేమాన్ని విస్మరించొద్దు
సింగరేణి సీఎండీని ఆదేశించిన డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka : హైదరాబాద్ – సింగరేణి కాలరీస్ సంస్థకు ఘనమైన చరిత్ర ఉంది. తాజాగా గుర్తింపు కార్మిక సంఘంకు సంబంధించి ఎన్నికలు ముగిశాయి. తొమ్మిదిన్నర ఏళ్ల పాటు నిర్వీర్యం చేస్తూ వచ్చింది గతంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ బరిలో దిగకుండానే చేతులు ఎత్తేసింది.
Bhatti Vikramarka Comment
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ రెండో స్థానంలో నిలువగా సీపీఐకి చెందిన ఐఎన్ టీయూసీ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. మాజీ సీఎం కేసీఆర్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు కార్మికులు. తాజాగా కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘానికి కూడా విస్తు పోయేలా తీర్పు ఇచ్చారు.
సింగరేణి కాలరీస్ పనితీరు గురించి డిప్యూటీ సీఎం(Bhatti Vikramarka) హైదరాబాద్ లోని సచివాలయంలో సమీక్ష చేపట్టారు. సీఎండీ శ్రీధర్ తో పాటు మరో సీనియర్ అధికారి కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. సింగరేణికి సంబంధించిన అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారు.
విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని స్పష్టం చేశారు. ఒడిశా నైని బొగ్గు బ్లాక్ ను ప్రారంభించేందుకు ఫోకస్ పెట్టండి.. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించ వద్దని సూచించారు భట్టి విక్రమార్క.
Also Read : Virahath Ali : పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తా