Bhatti Vikramarka : సంపద సృష్టిస్తాం పంపిణీ చేస్తాం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లా – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే భద్రాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు కూడా ఉన్నారు.
Bhatti Vikramarka Promiss
ఆలయ దర్శనం అనంతరం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మీడియాతో మాట్లాడారు. సంపదను సృష్టిస్తామని ప్రజలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు భట్టి విక్రమార్క.
100 రోజుల్లోపు మిగతా 4 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. గతంలో ప్రగతి భవన్ లోకి తాళం వేస్తే తాము వచ్చిన వెంటనే తెరిపించామని వెల్లడించారు.
మహిళా సాధికారతకు ఉచిత బస్సు సర్వీస్ ఏర్పాటు చేయడం నిదర్శనమని పేర్కొన్నారు. వేలాది మంది మహిళలకు ప్రతి రోజూ ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల రూపాయలకు పెంచామని స్పష్టం చేశారు.
Also Read : Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో శ్రీరాముడి పాలన