Bhatti Vikramarka Mallu : మాదే రాజ్యం ధరణి రద్దు చేస్తాం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్
Bhatti Vikramarka Mallu : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్ల వేదికగా జరిగిన బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భారీ ఎత్తున హాజరైన జనాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యారు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu). నాలుగు నెలలు ఓపిక పట్టాలని ఆ తర్వాత వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి రావడం ఖాయమని, వెంటనే కేసీఆర్ తీసుకు వచ్చిన ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. మొదటి సంతకం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల కొలువులను భర్తీ చేస్తామని తెలిపారు.
రైతులకు రూ. 1 లక్ష పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ మోసం చేశాడని, కానీ తాము రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క.
ఉచితంగా రేషన్ ఇస్తామని, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఉచితంగా 9 రకాల సరుకులు ఇస్తామని చెప్పారు. ఆదిలాబాద్ పిప్పిరి నుండి జడ్చర్ల దాకా 800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశాను. అడుగడుగునా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించానని తెలిపారు. కర్ణాటక ప్రజలు బీజేపీని పాతర పెట్టారని అన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ లో లేకుండా చేస్తే కన్నడ నాట కాషాయానికి కోలుకోలేని షాక్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.
Also Read : Parliament Row Comment