Bhatti Vikramarka Mallu : శ్వేత పత్రం అప్పుల మయం – భట్టి
తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వైనం
Bhatti Vikramarka Mallu : హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం శాసన సభ సమావేశాలలో శ్వేత పత్రం సమర్పించింది. ముందుగా ఎలాంటి వివరాలు ఇవ్వకుండా మాట్లాడమంటే ఎలా అని సభ్యులు ప్రశ్నించారు. ప్రత్యేకంగా దీని గురించి లేవదీశారు కూనమనేని సాంబవశివరావు, అక్బరుద్దీన్ ఓవైసీ, తన్నీరు హరీశ్ రావు.
Bhatti Vikramarka Mallu Comment
టీ బ్రేక్ కనీసం ఒక గంట సమయం ఇచ్చి శ్వేత పత్రంపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై సభాపతి సమ్మతి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu).
రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో సమర్పించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రం, ఎస్పీవీల మొత్తం అప్పు 2014-15లో రూ. 72,658 కోట్ల నుండి రూ. 6,71,757 కోట్లకు పెరిగిందని వెల్లడించారు.
ఈ భారీ పెరుగుదల దాదాపు 10 రెట్లు రుణాన్ని తీర్చగల సామర్థ్యం పరంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అపారమైన ఆర్థిక ఒత్తిడిని పెంచిందన్నారు. ఒక రకంగా గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ ధ్వజమెత్తారు డిప్యూటీ సీఎం.
Also Read : CP Srinivas Reddy : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు