Bhatti Vikramarka : ఘనంగా క్రిస్మస్ వేడుకలు – భట్టి
క్రిస్టియన్ సోదరులకు కానుకలు
Bhatti Vikramarka : హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది పూర్తి కావస్తోంది. ఇంకా కొన్ని రోజులే ఉండడంతో క్రిష్టియన్లకు సంబంధించి క్రిస్మస్ పండుగ రానుంది. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
Bhatti Vikramarka in Chirstmas Celebrations
ఇదిలా ఉండగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమీక్ష చేపట్టారు. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఏ ఒక్కరు ఇబ్బంది పడకూదని ఆదేశించారు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). ఈ వేడుకలకు వేదికను ఖరారు చేశారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి హాజరావుతారని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
కాగా నియోజకవర్గానికి 1000 మందికి చొప్పున గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 200 ప్రాంతాల్లో 500 మందికి క్రిస్మస్ బహుమతులు పంపిణీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క.
Also Read : KTR Slams : హామీల ఊసేది డీఎస్సీకి దిక్కేది