Bhatti Vikramarka : బీజేపీ బీఆర్ఎస్ నాటకం – భట్టి
సమస్యలు రాకుండా ప్రయత్నం
Bhatti Vikramarka : సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వైపు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడం చేత కాక భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారం , మరో వైపు 10వ తరగతి పరీక్షలకు సంబంధించి లీకులు బయటకు రాకుండా ఉండేందుకు సమస్యను పక్కదారి పట్టించేందుకు రెండు పార్టీల నేతలు నాటకాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు భట్టి విక్రమార్క. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ అసలు సమస్యలను పక్కదారి పట్టించేలా ప్లాన్ చేశారంటూ నిప్పులు చెరిగారు.
గ్రూప్ -1 పేపర్ లీక్ వ్యవహారం సద్దు మణిగేలా ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారంటూ ధ్వజమెత్తారు. అర్ధరాత్రి బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం ఏమిటి.
దానిపై రాద్దాంతం జరగడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. కనీసం పదో తరగతి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).
Also Read : బండి అరెస్ట్ అప్రజాస్వామికం