Bhatti Vikramarka : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఆయన చేపట్టిన పీపుల్స్ యాత్ర శుక్రవారం నాటికి 78వ రోజుకు చేరుకుంది. జడ్చర్ల మీదుగా సాగిన ఈ యాత్ర కొల్లాపూర్ లో ముగిసింది. అక్కడి నుంచి అచ్చంపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇవాళ నర్సాయిపల్లి, అనంతరం, బల్మూర్ , రాంజీపల్లి గేట్, సీతారామపురం , రాంపూర్ నగర్ లో పర్యటిస్తారు. పాదయాత్ర సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. మోసానికి చిరునామా కేసీఆర్ పాలన అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇప్పటి దాకా ఒక్క పోస్టు అయినా భర్తీ చేశారా అంటూ నిలదీశారు మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ యువతకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
తాము అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేసీఆర్ జైలుకు వెళ్లడం తప్పదన్నారు. తాము పవర్ లోకి వస్తే రూ. 2 లక్షల దాకా రైతులకు రుణ మాఫీ చేస్తామన్నారు. పంటకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ పేరుతో రైతు భరోసా కల్పిస్తామన్నారు. పంటలకు బీమా వర్తింప చేస్తామని తెలిపారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ప్రకటించారు. నాణ్యమైన విత్తనాల సరఫరా, ప్రతి ఎకరాకు సాగు నీరు ఇస్తామని, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమార్క.
Also Read : Temjen Imna Along