Bhatti Vikramarka : స్వేద పత్రం కాదు సోది పత్రం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ సమర్పించిన స్వేద పత్రంపై నిప్పులు చెరిగారు. అది పూర్తిగా సోది పత్రం అంటూ ఎద్దేవా చేశారు డిప్యూటీ సీఎం. గతంలో తాను ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కీలక సూచనలు చేయడం జరిగిందన్నారు.
Bhatti Vikramarka Comment
అప్పులు తీసుకు రావద్దని సూచించానని తెలిపారు. దీని వల్ల అదనపు భారం పడుతుందని చెప్పానని అయినా మాజీ సీఎం కేసీఆర్ పట్టించు కోలేదని వాపోయారు. చేసిన అప్పుల కారణంగా రాబోయే 40 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కుదేలుగా మారుతుందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
2020న సాక్షాత్తు తాను చేసిన వ్యాఖ్యలు శాసన సభలో రికార్డ్ అయి ఉన్నాయని కావాలంటే ఇప్పుడు చూసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చారంటూ ఆరోపించారు. ఇవాళ ఏ శాఖ తీసుకున్నా అందులో అంతులేని అవినీతి చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు .
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినంత మేర దోచుకున్నారని, దానిని దాచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ కుంగి పోవడం అన్నది చిన్న విషయమే అయితే జనాలను ఎందుకు చూసేందుకు అనుమతించ లేక పోయారంటూ నిప్పులు చెరిగారు మల్లు భట్టి విక్రమార్క.
Also Read : Kadiyam Srihari : కాంగ్రెస్ సర్కార్ పై కడియం కన్నెర్ర