Chandrashekhar Azad : కవితతో చంద్రశేఖర్ ఆజాద్ భేటీ
సామాజిక అంశాలపై ముచ్చట
Chandrashekhar Azad : భీమ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ గంటకు పైగా సమావేశం అయ్యారు. యూపీలో మోస్ట్ పాపులర్ దళిత నాయకుడిగా గుర్తింపు పొందారు ఆజాద్. ఇటీవలే ఆయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఆయన తృటిలో ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నారు.
Chandrashekhar Azad Meet
చంద్రశేఖర్ ఆజాద్ కు దళిత వర్గాలలో మంచి పట్టుంది. ఆయన తన సంస్థ , పార్టీ ద్వారా స్వంతంగా బడులను నిర్వహిస్తున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు చంద్రశేఖర్ ఆజాద్.
దేశంలోని రాజకీయాలు, చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో(Kavitha) చర్చించడం విశేషం. ఇద్దరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం మాట్లాడారనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె ఇటీవలే పలుమార్లు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ , ఈడీ మెట్లు ఎక్కింది. చివరకు ఆ కేసు మరుగున పడింది. ఈ తరుణంలో కవితతో ఆజాద్ భేటీ ఏమై ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Telangana DGP Salute : పోలీసులకు డీజీపీ సెల్యూట్