Bhumana Karunakar Reddy : సీఎం జ‌గ‌న్ ను క‌లిసిన భూమ‌న

టీటీడీ నూత‌న చైర్మ‌న్ గా నియామ‌కం

Bhumana Karunakar Reddy : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నూత‌న చైర్మ‌న్ గా నియ‌మితులైన తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి బుధ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా తాడేప‌ల్లి గూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లుసుకున్నారు. ఆయ‌న‌ను తాజాగా సీఎం టీటీడీ చైర్మ‌న్ గా నియ‌మించారు.

Bhumana Karunakar Reddy Met Jagan

ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయం, కోట్లాది భ‌క్తుల‌ను క‌లిగిన ఏకైక పుణ్య క్షేత్రం తిరుమ‌ల దేవ‌స్థానానికి చైర్మ‌న్ గా నియ‌మించినందుకు జ‌గ‌న్ రెడ్డికి ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. పుష్ప గుచ్ఛం సీఎంకు అంద‌జేశారు.

ఇదిలా ఉండ‌గా ఆగ‌స్టు 10న గురువారం తిరుమ‌లలో టీటీడీ చైర్మ‌న్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి(Bhumana Karunakar Reddy). ఇదే స‌మ‌యంలో సీఎంను క‌లిసిన వారిలో భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న త‌న‌యుడు భూమ‌న అభిన‌య్ రెడ్డి కూడా ఉన్నారు.

కాగా నూత‌న చైర్మ‌న్ గా నియ‌మితులైన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం తిరుప‌తికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌తంలో దివంగ‌త సీఎం డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ గా ప‌ని చేశారు. మ‌రో వైపు హిందూ ధ‌ర్మం మీద న‌మ్మ‌కం లేని వాళ్ల‌కు ఎలా టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట బెడ‌తారంటూ ప్ర‌శ్నించారు బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.

Also Read : Chandrababu Naidu Case : చంద్ర‌బాబుపై కేసు న‌మోదు

Leave A Reply

Your Email Id will not be published!