Bhupalapally Police Hats Off : హ్యాట్సాఫ్ భూపాలపల్లి పోలీస్
మానవతను చాటుకున్న సీఐ, సిబ్బంది
Bhupalapally Police Hats Off : మానవత్వం ఇంకా బతికే ఉందని చాటారు తెలంగాణ రాష్ట్రం లోని భూపాలపల్లి పోలీసులు(Bhupalapally Police Hats Off). బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ ఇంకా తేరుకోలేదు పలు జిల్లాలు. ప్రధానంగా వరంగల్ , ఖమ్మం జిల్లాలు తీవ్రంగా నష్ట పోయాయి. ఇంకా పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి.
Bhupalapally Police Hats Off For Social Service
ఈ తరుణంలో భారీ ఎత్తున వరద నీరు పోటెత్తింది మోరంచపల్లి వాగుకు. వరద ఉధృతికి నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. కుళ్లి పోయిన మృత దేహాలను ముట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో భూపాలపల్లి సీఐ రాం నర్సింహారెడ్డి , చిట్యాల ఎస్ఐ రమేష్ , కొంత మంది స్థానికులతో ముందుకు వచ్చారు. వాగు నుంచి మృత దేహాలను మోశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం నాకేం వస్తుందని ఆశించే ఈ సమాజంలో ఇలాంటి వ్యక్తులు, పోలీసులు కూడా ఉండడం విశేషం. వీరిలోని మానవత్వానికి ప్రజలు, నెటిజన్లు సలాం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ డీజీపి అంజనీ కుమార్ , ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులు భూపాలపల్లి సీఐ, చిట్యాల ఎస్ఐలను అభినందించారు. ఇలాంటి వాళ్లు ఉండడం వల్లనే తమ పోలీస్ శాఖకు మంచి పేరు వస్తోందని పేర్కొన్నారు.
Also Read : Car Accdent Tankbund : ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం