Bhupesh Baghel : ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సీఎం భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel)సంచలన కామెంట్స్ చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. దైవం..మతం పేరుతో రాజకీయం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు.
దేశంలో ఎన్నడూ లేని రీతిలో అల్లర్లు , ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తి భావానికి ప్రతీకగా నిలిచే ఆంజనేయుడు, శ్రీరాముడు, ఇలా ప్రతి దేవుడిని రాజకీయానికి వాడుకుంటోందంటూ మండిపడ్డారు.
ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే శ్రీరామ చంద్రుడిని రాంబోగా మార్చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
ఆంజనేయుడిని కోపానికి, దూకుడుకు ప్రతీకగా చేసి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు నాటకాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. జాతీయ వాదానికి బీజేపీ పాల్పడుతోందంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు భూపేశ్ బఘేల్(Bhupesh Baghel).
గతంలో ఎన్నడూ లేని రీతిలో చోటు చేసుకుంటున్న ఘటనలకు బీజేపీనే ప్రధాన కారణమని ఆరోపించారు. గత ఏప్రిల్ నెలలో దేశంలోని రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
అన్యాయాన్ని, బీజేపీ చేస్తున్న ఆగడాలను, ఆ పార్టీ అనుబంధ సంస్థలు ప్రవర్తిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఛత్తీస్ గఢ్ సీఎం.
ఇదే సమయంలో అన్యాయాన్ని, బీజేపీ ఆగడాలను , చేస్తున్న ఘర్షణల్ని ప్రశ్నించే పార్టీలు, వ్యక్తులు, సంస్థలు, ప్రజాస్వామిక వాదులను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేస్తోందంటూ ఆరోపించారు బఘేల్.
బీజేపీని ఈ దేశమే కాదు చరిత్ర కూడా క్షమించదన్నారు భూపేశ్ బఘేల్.
Also Read : రూల్స్ అతిక్రమించ లేదు – ఇండిగో సిఇఓ