Bhuvaneshwari : కుట్ర నిజం అరెస్ట్ అక్రమం
బాబు భార్య భువనేశ్వరి దేవి
Bhuvaneshwari : రాజమండ్రి – తన భర్తను కావాలని ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి దేవి. ఆమె తన తనయుడు నారా లోకేష్(Nara Lokesh), కోడలు నారా బ్రాహ్మణితో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలుసుకున్నారు. ఆయన క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.
Bhuvaneshwari Comments Viral
45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, మచ్చ లేని నాయకుడు తన భర్త అని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కావాలని ఇరికించే ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర నిజమని, అరెస్ట్ చేయడం అక్రమమని ఆరోపించారు నారా భువనేశ్వరి దేవి.
అధికారం ఉంది కదా అని మిడిసి పడితే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే , ఎవరో చేసిన తప్పిదాలకు తన భర్త ఎలా బాధ్యత వహిస్తాడని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఏపీ సీఎం జగన్ రెడ్డి కావాలని కక్ష సాధింపు ధోరణికి పాల్పడ్డారని ఆరోపించారు. తన గురించి కూడా ఆనాడు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వాపోయారు. అయినా తనకు ఓ తల్లి, చెల్లి, కూతురు, భార్య ఉందన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఏది ఏమైనా తన భర్త నారా చంద్రబాబు నాయుడు ఎవరికీ భయపడే వ్యక్తి కాదన్నారు. నిర్దోషిగా బయటకు వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు తప్పక ఉంటాయన్నారు భువనేశ్వరి దేవి.
Also Read : Priyank Kharge : ఆజ్ తక్ పై కాంగ్రెస్ సర్కార్ గుస్సా