Bibi Nagar AIIMS : బీబీనగర్ ఎయిమ్స్ కు రూ. 1365 కోట్లు
ఆరోగ్య తెలంగాణ బీజేపీ లక్ష్యం
Bibi Nagar AIIMS : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సంక్షేమం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ జి. కిషన్ రెడ్డి. ఆరోగ్య తెలంగాణ తీసుకు రావడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బీబీనగర్ లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ అభివృద్ది కోసం రూ. 1365 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు.
Bibi Nagar AIIMS Hospital
ఈ నిధులతో 750 పడకల ఆస్పత్రి, 100 సీట్ల మెడికల్ కాలేజీ, 60 సీట్ల నర్సింగ్ కళాశాల, 30 పడకల ఆయుష్ బ్లాక్ ను ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి(G Kishan Reddy) వెల్లడించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించి తెలంగాణ ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి దోహద పడుతోందన్నారు. నాణ్యమైన వైద్య విద్యను ప్రోత్సహిస్తోందని తెలిపారు.
ట్విట్టర్ వేదికగా సోమవారం బీజేపీ చీఫ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో ముందంజలో ఉందన్నారు. తాము మాటలు చెప్పమని కేవలం చేతల్లో చూపిస్తామని పేర్కొన్నారు జి. కిషన్ రెడ్డి.
రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కేవలం కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప ఇంకేమీ చేయడం లేదన్నారు. భారీ ఎత్తున నిధులు మంజూరు చేసిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్.
Also Read : Arvind kejriwal : మణిపూర్ పై మోదీ మౌనం దారుణం