Biden Putin : ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడులను అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ తీవ్రంగా ఖండించాడు. అంతే కాదు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించాడు.
ఆ దేశానికి చెందిన ప్రధాన బ్యాంకుల కార్యకలాపాలు, లావాదేవీలను సైతం నిలిపి వేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశాడు.
ఇది అత్యంత హేయ్యమైన చర్యగా అభివర్ణించాడు. సమస్యను మరింత జఠిలం చేసి ముందస్తు హెచ్చరికలు లేకుండానే దాడులకు దిగడం పిరికిపంద చర్య అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అవసరమైతే తాము కూడా ఉక్రెయిన్ కు సహకరిస్తామని చెప్పాడు. జోసెఫ్ బైడెన్(Biden Putin )అమెరికా జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. కీలక వ్యాఖ్యలు చేశాడు.
యుద్దం అనివార్యం కాని పరిస్థితుల్లో సైతం రష్యా కావాలని ఉక్రెయిన్ పై దాడికి దిగుతోందంటూ మండిపడ్డాడు. ఇప్పటికైనా పుతిన్ వెనక్కి తగ్గాలని లేక పోతే యావత్ ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇప్పటికే సైనికులతో పాటు సామాన్య పౌరులు కూడా చని పోయారని దీనికి రష్యానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నాటోతో పాటు బ్రిటన్, జర్మనీ , ఫ్రాన్స్ సైతం రష్యాపై నిప్పులు చెరిగాయి.
ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించాయి. కానీ ఇప్పటి వరకు పుతిన్ ముందుకే సాగుతున్నారు తప్ప వెనక్కి ఏమాత్రం తగ్గడం లేదు.
బైడన్ ఆగ్రహం వ్యక్తం చేస్తే పుతిన్ మాత్రం హాయిగా నవ్వుకోవడం ఇప్పుడు అందరినీ విస్తు పోయేలా చేసింది. రాబోయే రోజుల్లో బలవంతులదే రాజ్యం అన్న స్థితికి మారే ప్రమాదం ఉంది.
Also Read : చావు కబురు చల్లగా చెప్పిన నాటో