FaceBook CEO : బైడెన్ కుమారుడి స్టోరీ సెన్సార్ నిజ‌మే

ఒప్పుకున్న ఫేస్ బుక్ సిఇఓ జుక‌ర్ బ‌ర్గ్

FaceBook CEO : తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసిన అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కుమారుడికి సంబంధించిన ప్ర‌త్యేక క‌థ‌నాన్ని సెన్సార్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని అంగీక‌రించారు ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకెర్ బ‌ర్గ్(FaceBook CEO) .

ఎన్నిక‌ల త‌ప్పుడు స‌మాచారాన్ని నియంత్రించాల‌ని ఎఫ్బీఐ చేసిన అభ్య‌ర్థ‌న మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. హంట‌ర్ బైడ‌న్ ల్యాప్ టాప్ క‌థ‌నాన్ని సెన్సార్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

ఒక వారం పాటు స్టోరీని సెన్సార్ చేసిన‌ట్లు ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ది జో రోగ‌న్ ఎక్స్ పీరియ‌న్స్ పోడ్ కాస్ట్ లో వెల్ల‌డించాడు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్పుడు స‌మాచారాన్ని నియంత్రించాల‌ని ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (ఎఫ్బీఐ) త‌మ‌ను అభ్య‌ర్థించింద‌ని పేర్కొన్నారు.

ఆ మేర‌కు తాను ఆ ప్ర‌త్యేక క‌థ‌నాన్ని సెన్సార్ చేయ‌డం జ‌రిగింద‌ని కావాల‌ని మాత్రం చేసింది కాద‌ని స్ప‌ష్టం చేశారు మార్క్ జుకెర్ బ‌ర్గ్. హంట‌ర్ బైడ‌న్ క‌థ‌నం వంటి వివాదాస్ప‌ద స‌మ‌స్య‌ల‌ను ఫేస్ బుక్ ఎలా నిర్వ‌హిస్తుంది,

అది సెన్సార్ చేయ‌బ‌డిందా అని జో రోగ‌న్ జుక‌ర్ బ‌ర్గ్ ను ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు పై విధంగా స‌మాధానం ఇచ్చాడు సిఇఓ. ట్విట్ట‌ర్ కంటే భిన్న‌మైన మార్గాన్ని అనుస‌రించామ‌ని తెలిపారు.

ర‌ష్యా జోక్యం చేసుకుంటుందోన‌న్న అనుమ‌నాం వ్య‌క్తం చేసింది ఎఫ్బీఐ. ఏ సంస్థ అయినా దేశంలోని చ‌ట్టాల‌కు లోబ‌డి ప‌ని చేయాల్సి ఉంటుంద‌న్నారు.

త‌మ ప్రోటోకాల్ భిన్నంగా ఉంటుంద‌న్నారు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్. ఎవ‌రు ఏ స్థానంలో ఉన్నా , ఎంత‌టి స్థాయిలో ఉన్నా త‌మ రూల్స్ కు అనుగుణంగానే న‌డుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : 13 న‌గ‌రాల‌లో 5జీ సేవ‌ల విస్త‌ర‌ణ

Leave A Reply

Your Email Id will not be published!