Big Blow Aap : ఆప్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్
కక్ష సాధింపు ధోరణి మంచిది కాదు
Big Blow Aap : కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు పంజాబ్, హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నేత తేజిందర్ బగ్గాతో పాటు ఒకప్పటి ఆప్ నేత ప్రముఖ కవి కుమార్ బిశ్వాస్ పై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడాన్ని తప్పు పట్టింది.
వీటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టి వేసింది. బుధవారం కీలక తీర్పు(Big Blow Aap) వెలువరించింది. తేజిందర్ బగ్గా చేసిన ట్వీట్లు పంజాబ్ పై చేయలేదని , ఆగ్రహం కలిగించేవిగా లేవని తాము గుర్తించినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా రాజకీయాల్లో ఉన్న వారు ఒకరిపై మరొకరు సరదాగా వ్యాఖ్యలు చేయడం, ఆరోపణలు చేసుకోవడం పరిపాటేనని పేర్కొంది.
ఇలాంటి కామెంట్లు, లేదా పోస్టులు ఎలాంటి వివాదాలకు దారి తీయమని స్పష్టం చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటో తమకు తెలియడం లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఇందు వల్ల మీ సర్కార్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటో మీరే చెబితే బాగుంటుందంటూ మెట్టికాయలు వేసింది.
ఇక మరో పిటిషన్ ను విచారించింది కోర్టు. ఖలిస్తాన్ ఉద్యమానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడంటూ కవి కుమార్ బిశ్వాస్ పై ఆప్ ఆరోపణలు చేసింది. ఇతని వల్ల పంజాబ్ కు ప్రమాదం అని పేర్కొంది. ఆయన కామెంట్స్ వల్ల, రాతల వల్ల ఆప్ కు తీరని నష్టం వాటిల్లిందంటూ ఆరోపించింది ఆప్ సర్కార్.
ఘజియాబాద్ లో కేసు నమోదు చేసి విచారణకు రావాలని కోరడంతో బిశ్వాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హర్యానా కోర్టు కొట్టి వేసింది. ఇక నుంచి ఇలాంటివి తమ వద్దకు రాకూడదని హెచ్చరించింది.
Also Read : హుమా ఖురేషీ..ధావన్ హల్ చల్