Election Commission : ఎన్నిక‌ల్లో హామీల‌పై పార్టీల‌కు బిగ్ షాక్

కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Election Commission : ఎట్ట‌కేల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం జూలు విదిల్చింది. ఏకంగా ఎడా పెడా హామీలు ఇస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతూ ప‌వ‌ర్ లోకి వ‌చ్చేందుకు నానా జిమ్మిక్కులు ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్న పార్టీల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఎన్నిక‌ల మేనిఫెస్టో, వాటిలో ఇచ్చిన హామీల‌ను ఏ ర‌కంగా అమ‌లు చేస్తారో చెప్పాల‌ని కోరింది.

అంతే కాదు వాటికి అవ‌స‌ర‌మ‌య్యే నిధులు ఎలా స‌మ‌కూరుస్తారంటూ ప్ర‌శ్నించింది. వీట‌న్నింటికి ఆయా పార్టీలు త‌మ‌కు లెక్క చెప్పాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. ఇచ్చిన వాగ్ధానాల‌కు సంబంధించి ఆర్థిక ప‌ర‌మైన చిక్కుల వివ‌రాల‌ను అడ‌గాల‌ని ఎన్నిక‌ల సంఘం రాజ‌కీయ పార్టీల‌కు లేఖ రాసింది.

ప్ర‌తిపాదిత మార్పుల‌పై పార్టీలు అక్టోబ‌ర్ 19 లోగా స్పందించాల‌ని ఎన్నిక‌ల సంఘం కోరింది. ఎన్నిక‌ల వాగ్ధానాలు చేసే రాజ‌కీయ పార్టీలు వాటికి ఎలా నిధులు స‌మ‌కూరుస్తాయో వివ‌రాల‌ను తెలియ చేయాల‌ని కోరింది. ఓట‌ర్ల‌కు తాము వాగ్ధానం చేసే వాటికి పార్టీలు మ‌రింత జ‌వాబుదారీగా ఉండేలా కొత్త నిబంధ‌న‌ల‌ను సూచించాల‌ని ఎన్నిక‌ల సంఘం సూచించింది.

మంగ‌ళ‌వారం ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ఈసీ(Election Commission) . ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాల ఆర్థిక ప‌ర‌మైన చిక్కులు, వాటికి ఆర్థిక సాయం చేసే మార్గాలు, వివారాల‌ను అడ‌గాల‌ని ఎన్నిక‌ల సంఘం రాజ‌కీయ పార్టీల‌కు త‌న ప్ర‌ణాళిక‌పై లేఖ రాసింది. ఈ మేర‌కు త‌మ అభిప్రాయాల‌ను తెలియ చేయాల‌ని స్ప‌ష్టం చేసంది.

ఏ వాగ్ధానాలనైనా నెర వేర్చేందుకు సాధ్య‌మ‌య్యే హామీల పైనే ఓట‌ర్ల విశ్వాసం కోరాల‌ని ఎన్నిక‌ల సంఘం త‌న లేఖ‌లో పేర్కొంది.

Also Read : ముగ్గురు ఫిజిక్స్ శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్

Leave A Reply

Your Email Id will not be published!