WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్
26.85 లక్షల అకౌంట్లు బ్యాన్
WhatsApp : ఫేస్ బుక్ (మెటా)కు చెందిన ఇన్ స్టంట్ మెస్సేజ్ వాట్సాప్(WhatsApp) కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రపంచ మార్కెట్ లో ఎక్కువ మంది యూజర్లు కేవలం భారత దేశం నుంచి ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇంటర్నెట్ వినియోగంలో భారతీయులే ఎక్కువ. ఫేక్ అకౌంట్లను ఏర్పాటు చేసుకున్న వారిని గుర్తించే పనిలో పడింది వాట్సాప్ సంస్థ.
ఆయా సోషల్ మీడియా సంస్థలు బగ్ లు, ఫేక్ అకౌంట్లను ఏరి పారేసే పనిలో పడ్డాయి. తాజాగా కోలుకోలేని షాక్ ఇచ్చింది వాట్సాప్. సెప్టెంబర్ నెలలో భారత్ లో 26.85 లక్షల అకౌంట్లను నిషేధించినట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. గత ఆగస్టు నెలలో సైతం వాట్సాప్ సంస్థ. యూజర్లకు ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించింది వాట్సాప్(WhatsApp).
భారీ ఎత్తున నిషేధం విధించడంతో యూజర్లు లబోదిబోమంటున్నారు. సంస్థ పేర్కొన్నట్లు ముందస్తుగా బగ్ లు గుర్తించామని పేర్కొంది. వీటిలో పూర్తిగా 8,72,000 అకౌంట్లు ముందుగా బ్యాన్ విధించింది. ఏవైనా అనుమానాలు లేదా ఇబ్బందులు ఉన్నట్లయితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది వాట్సాప్.
ఈ మేరకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై కన్నేసింది. ఈ మేరకు ఐటీ శాఖ అన్ని సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఆదేశించింది.
తప్పుడు సమాచారం, నకిలీ వార్తలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో కేంద్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందు కోసం గ్రీవెన్స్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది.
Also Read : గూగుల్ క్రోమ్ యూజర్లు జర జాగ్రత్త