Harish Rawat : దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతాయని అనుకున్న ఈ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా సాగాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఏమీ చెప్పలేరు.
ఒక్కోసారి విజయం వరిస్తుంది..ఊరిస్తుంది. ఇంకోసారి ఓటమి పలకరిస్తుంది. గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకున్నట్లయితే ఓకే. కానీ దానిని ఓ టాస్క్ గా మార్చుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. అంతే కాదు ఎలాంటి ట్రబుల్స్ లోనైనా పార్టీని నడిపంచ గలిగే సత్తా కలిగిన నాయకుడిగా, అపర చాణక్యుడిగా పేరుంది ఉత్తరాఖండ్ కు చెందిన హరీష్ రావత్(Harish Rawat).
ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన రాజకీయ నాయకుడిగా ఇప్పటికే గుర్తింపు పొందారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నత పదవులు నిర్వహించారు.
పలు రాష్ట్రాలకు ఆయన ఇన్ చార్జ్ గా వ్యవహరించారు. ఈసారి ఆయన పార్టీకి అంతా తానై వ్యవహరించారు. చాలా కష్టపడ్డారు. ఒకానొక దశలో బీజేపీకి ధీటుగా ఉండేలా తీసుకు వచ్చారు.
కానీ అటు భారతీయ జనతా పార్టీకి చెందిన సీఎం పుష్కర్ సింగ్ ధామీని ఉత్తరాఖండ్ ప్రజలు ఛీ కొట్టారు. ఇక హరీష్ రావత్ ను కూడా ఓడించి ఖంగు తినేలా చేశారు.
ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదని ప్రజలే చరిత్ర నిర్మాతలని మరోసారి రుజువు చేశారు.