Eknath Shinde : మారిన మారాఠా సీన్ షిండేనే సీఎం
వ్యూహం మార్చిన బీజేపీ రేపే 7.30 కి ఫిక్స్
Eknath Shinde : భారతీయ జనతా పార్టీ వ్యూహం మార్చింది. మహారాష్ట్ర సంక్షోభానికి తెర దించుతూ ఏకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) కు మద్దతు ప్రకటించింది.
సీఎం రేసు నుంచి చివరి నిమిషం వరకు బీజేపీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వినిపించింది. కానీ వ్యూహం మార్చింది. మహారాష్ట్రలో తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శల నుంచి తప్పించుకునేందుకు, పోయిన పరువును కాపాడుకునేందుకు తెలివిగా వ్యవహరించింది.
ఫడ్నవీస్ కు బదులు షిండేకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వయంగా ఈ విషయాన్ని దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) వెల్లడించడం విశేషం.
ఇందుకు సంబంధించి ఏక్ నాథ్ షిండే శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తాను ప్రభుత్వం నుండి దూరంగా ఉంటాను. కాని అది సజావుగా సాగేలా చూస్తానని చెప్పారు దేవేంద్ర ఫడ్నవీస్.
ఆరోజు మంత్రులుగా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయరని చెప్పారు. ఇదిలా ఉండగా తనపై నమ్మకం ఉంచి సీఎంగా ప్రకటించినందుకు ఏక్ నాథ్ షిండే కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇది వారి ఔన్నత్యానికి, గౌరవానికి నిదర్శనం నాకు ముఖ్యమంత్రి పదవి అప్పగించడమని పేర్కొన్నారు ఏక్ నాథ్ షిండే. ఇదిలా ఉండగా ఫడ్నవీస్ , షిండే ఇద్దరూ గవర్నర్ తో భేటీ అయ్యారు.
Also Read : సంజయ్ రౌత్ వల్లే ఈ సంక్షోభం – కేసర్కర్