Dr Vaishali Kidnap : మ‌లుపు తిరుగుతున్న వైశాలి కిడ్నాప్ కేసు

పెళ్లి చేసుకున్నాన్న న‌వీన్ రెడ్డి..కాద‌న్న తండ్రి

Dr Vaishali Kidnap : తెలంగాణ‌లో రంగారెడ్డి జిల్లా మ‌న్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు రోజు రోజుకు మ‌లుపులు తిరుగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే యువ‌తిని కిడ్నాప్ చేయ‌డ‌మే కాకుండా గ్యాంగ్ తో దాడికి దిగడం, వ‌స్తువుల్ని చింద‌ర వంద‌ర‌గా మారాయి.

ఆపై బాధితురాలి పేరెంట్స్ ధ‌ర్నా చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. త‌న కూతురును న‌వీన్ రెడ్డి కిడ్నాప్ కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించారు. దీంతో న‌ల్ల‌గొండ నుంచి విజ‌య‌వాడ వైపు పారిపోతుండ‌గా న‌వీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డితో పాటు ఈ దాడిలో పాల్గొన్న గ్యాంగ్ పై కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఇదిలా ఉండ‌గా కిడ్నాప్ న‌కు గురై విడుద‌లైన వైశాలి(Dr Vaishali Kidnap) డెంట‌ల్ డాక్ట‌ర్ గా ఉన్నారు. అరెస్ట్ చేసిన న‌వీన్ రెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు న‌మోదు చేశారు. విచిత్రం ఏమిటంటే వైశాలి రెడ్డి త‌న భార్య అని 2021 ఆగ‌ష్టులో తాను పెళ్లి చేసుకున్నాన‌ని చెప్పాడు. బాప‌ట్ల జిల్లా వ‌ల‌ప‌ర్ల ఆల‌యంలో వివాహం చేసుకున్న‌ట్లు తెలిపాడు.

బీడీఎస్ పూర్త‌య్యేంత వ‌ర‌కు ఫోటోలు బ‌య‌ట పెట్ట‌వ‌ద్దంటూ కోరింద‌ని చెప్పాడు న‌వీన్ రెడ్డి. ఇప్ప‌టి వ‌ర‌కు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ దాడిలో వైశాలి తల్లిదండ్రులకు గాయాల‌య్యాయి. ఇదే స‌మ‌యంలో వైశాలి రెడ్డి పేరెంట్స్ త‌న‌తో ఖ‌ర్చులు పెట్టించార‌ని, త‌న‌కు ఇచ్చి పెళ్లి చేస్తామ‌ని మాట ఇచ్చార‌ని ఆరోపించారు న‌వీన్ రెడ్డి.

అయితే వైశాలి తండ్రి దామోద‌ర్ రెడ్డి పెళ్లి చేసుకోవ‌డం అన్న‌ది అబ‌ద్ద‌మ‌న్నారు. కాగా న‌వీన్ రెడ్డి సైకోగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా బాధితురాలు నోరు విప్పితే అస‌లు విష‌యం తేలుతుంది.

Also Read : యువ‌తి సేఫ్ న‌వీన్ రెడ్డి గ్యాంగ్ పై కేసు

Leave A Reply

Your Email Id will not be published!