Bihar BJP Poster Viral : బీహార్ లో మోదీ ఫ్లెక్సీ కలకలం
బీజేపీ నేత మోదీపై గుస్సా
Bihar BJP Poster Viral : మణిపూర్ మండుతోంది. హింసోన్మాదంతో రగిలి పోతోంది. అల్లర్లతో అట్టుడుకుతోంది. ఇప్పటి దాకా 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మంది గాయపడ్డారు. 50 వేల మంది నిరాశ్రయులుగా మారారు. ఇంత జరుగుతున్నా బాధ్యత కలిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూర్తి నిద్ర పోతున్నాడే తప్పా ప్రజలను పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బీహార్ పార్టీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ.
Bihar BJP Poster Viral On Media
బీహార్ భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. మోదీని టార్గెట్ చేశారు. పార్టీకి షాక్ ఇస్తూ ఏకంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ దేశాన్ని సర్వ నాశనం చేశారంటూ ఆరోపించారు. మహిళలను నగ్నంగా ఊరేగిస్తుంటే ఎక్కడుందీ హిందూ ధర్మం అని ప్రశ్నించారు. అంతే కాదు మోదీని విమర్శిస్తూ ఏకంగా బీహార్ పట్టణంలో అందరికీ కనిపించేలా ప్రధాన కూడలిలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఆ పార్టీకి రాజీనామా చేసిన అధికార ప్రతినిధి.
ప్రస్తుతం వినోద్ శర్మ(Vinod Sharma) ఉన్నట్టుండి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొత్తం మీద వ్యవస్థలను నాశనం చేసిన మోదీపై ఆ పార్టీలోనే వ్యతిరేకత రావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాను ఎవరి పక్షాన ఉన్నాడో చూస్తేనే తెలుస్తుందంటున్నారు వినోద్ శర్మ.
Also Read : Bihar BJP Poster Viral : బీహార్ లో మోదీ ఫ్లెక్సీ కలకలం