Nitish Kumar Dalai Lama : దలైలామాను కలుసుకున్న నితీశ్
మహా బోధి ఆలయంలో ప్రార్థనలు
Nitish Kumar Dalai Lama : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామాను శుక్రవారం జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మహా బోధి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం దలైలామా, సీఎం(Nitish Kumar Dalai Lama) కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన దలైలామా బస చేసిన టిబెటెన్ ఆశ్రమానికి మధ్యాహ్నం 12.40 గంటలకు చేరుకున్నారు సీఎం.
దాదాపు అరగంట పాటు గడిపారు. నితీశ్ కుమార్ కు ఘన స్వాగతం లభించింది. దాదాపు రెండు ఏళ్ల విరామం తర్వాత టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వార్షిక విహార యాత్రలో ఇండియాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం బోద్ గయాలో విడిది చేశారు. ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ దలైలామాను కలుసు కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సమావేశం అనంతరం సీఎం బుద్దుడు జ్ఞానోదయం పొందాడని చెప్పబడే ప్రదేశంలో ఉన్న మహా బోధి ఆలయంలో కొంత సేపు ఉన్నారు. ప్రముఖులు క్యూ కట్టడంతో భారీ ఎత్తున ఆశ్రమం చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దలైలామాను కలిసేందుకు సాధారణ ప్రజలను అనుమతించ లేదు.
దీంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు గురువు అభిమానులు. దలాలైమాను కలుసుకున్న అనంతరం సీఎం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా ఈ సమయంలో ప్రజలు భారీ సంఖ్యలో బోధ్ గయాను సందర్శిస్తారు. ప్రార్థనలు చేస్తారు..బోధనలు వింటారు. కరోనా కారణంగా అవకాశం రాలేదు. ఈసారి కరోనా తగ్గడంతో తిరిగి ప్రారంభమైంది. అందుకే తాను కూడా వచ్చానని అన్నారు సీఎం.
Also Read : రైల్వేల ఆధునీకరణకు పెట్టుబడులు