Nitish Kumar : ప్ర‌తిసారీ కేబినెట్ లో చేర్చుకోలేం – సీఎం

నితీశ్ కుమార్ సీరియ‌స్ కామెంట్స్

Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కుమార్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి బీమా భార‌తి తన‌కు చాన్స్ ఇవ్వ‌క పోతే త‌ప్పుకుంటాన‌ని బెదిరించ‌డంపై స్పందించారు. గురువారం నితీశ్ కుమార్(Nitish Kumar) మీడియాతో మాట్లాడారు.

పార్టీ ఆమెను గుర్తించింది. ఆపై గౌర‌వించింది. దానికి క‌ట్టుబ‌డి ఉండాలే త‌ప్పా మంత్రి ప‌ద‌వి రానంత మాత్రాన అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఆమె కామెంట్స్ చేయ‌డం వ‌ల్ల పార్టీకి కానీ ప్ర‌భుత్వానికి కానీ ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని, ఆ విష‌యాన్ని బీమా భార‌తి తెలుసుకుంటే మంచిద‌న్నారు సీఎం.

ఏదైనా అభ్యంత‌రం ఉన్న‌ట్ల‌యితే లేదా అసంతృప్తి ఉంటే పార్టీ చీఫ్ గా, ప్ర‌భుత్వధినేత‌గా త‌న‌తో వ‌చ్చి చెప్పాల‌ని బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాకు ఎక్కితే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు నితీశ్ కుమార్.

ఆమె ప‌ద‌వి కోస‌మే అలా అంటే ఇన్నేళ్లుగా రాజ‌కీయాల‌లో ఉన్న వ్య‌క్తిని త‌న‌కు ఎంత అనుభ‌వం ఉండాల‌ని ప్ర‌శ్నించారు. లేషి సింగ్ ను చేర్చుకోవ‌డంపై బీమా భార‌త్ టార్గెట్ చేశారు.

ఆమెను తొల‌గించాల‌ని లేక పోతే తాను త‌ప్పుకుంటాన‌ని హెచ్చ‌రించారు. దీనిని లైట్ గా తీసుకున్నారు సీఎం. తాను ప్ర‌తిసారీ అంద‌రినీ మంత్రి ప‌ద‌విలో కూర్చో బెట్ట లేన‌ని చెప్పారు.

బీమా భార‌తి కూడా రెండుసార్లు మంత్రిగా ఉన్నారు. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉన్నారు. ప్ర‌శాంతంగా ఉండాల్సిన ఆమె ఎందుక‌నో గీత దాటి మాట్లాడుతోంది.

ఇది పూర్తిగా పార్టీ నియ‌మావ‌ళికి విరుద్ద‌మ‌న్నారు. ఒక వేళ కాద‌ని అనుకుంటే వేరే చోటుకు వెళ్లాల‌ని అనుకుంటే త‌న‌కు అభ్యంత‌రం లేద‌న్నారు నితీశ్ కుమార్(Nitish Kumar).

Also Read : షాన‌వాజ్ హుస్సేన్ పై రేప్ కేసుకు ఓకే

Leave A Reply

Your Email Id will not be published!