Ravi Shankar Prasad Nitish : విశ్వాసాన్ని కోల్పోయిన బీహార్ సీఎం
నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి రవి శంకర్
Ravi Shankar Prasad Nitish : దేశంలో మతం పేరుతో రాజకీయాలు చేస్తోందంటూ భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. సీపీఎం 11వ జాతీయ మహాసభల్లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిగతా పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్ల కంటే మించి బీజేపీకి రావని జోష్యం చెప్పారు. సీఎం చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్(Ravi Shankar Prasad Nitish) తీవ్రంగా స్పందించారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏం మాట్లాడుతున్నారో తనకే అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు ఆయనను నమ్మడం లేదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. దేశం మారిందని , దేశ ప్రజలు కూడా మారారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, ఆయన నాయకత్వాన్ని నమ్ముతున్నారని చెప్పారు. రవి శంకర్ ప్రసాద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ఇదే సయమంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నితీశ్ కుమార్ ఇదే సమయంలో తన రాజకీయ విశ్వసనీయతను పెంచు కోలేక పోయారని మండిపడ్డారు. నాయకత్వం ఒకరు ఇస్తే రాదని తనంతకు తానుగా తెచ్చుకుంటే వస్తుందని స్పష్టం చేశారు. తమకు నితీశ్ కుమార్ పట్ల లేదా ఇతర నాయకులు, పార్టీల పట్ల భయం లేదన్నారు. ఎందుకంటే దేశంలో గతంలో లేనంతగా భారత్ ఇప్పుడు వెలిగి పోతుందన్నారు రవిశంకర్ ప్రసాద్.
నితీశ్ కుమార్ కు దేశానికి ప్రధాని కావాలని కోరిక ఉందని కానీ మోదీ ఉన్నంత వరకు ఆ కల నెరవేరదన్నారు.
Also Read : ఇకనైనా కాంగ్రెస్ మేలుకోవాలి – నితీశ్