Bill Gates : బిల్ గేట్స్ లైంగిక వేధింపుల‌పై స‌మీక్ష

మైక్రోసాఫ్ట్ నిర్ణ‌యంపై ఉత్కంట‌

Bill Gates : మైక్రోసాఫ్ట్ ఫౌండ‌ర్ బిల్ గేట్స్ పై వ‌చ్చిన లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై మైక్రో సాఫ్ట్ మ‌రోసారి స‌మీక్షించ‌నుంది. ఇదిలా ఉండ‌గా వాటాదారుల ఒత్తిళ్ల మేర‌కు బిల్ గేట్స్ పై వ‌చ్చిన లైంగిక వేధింపులు, లింగ వివ‌క్ష విధానాల‌ను ప‌రిశీలించేందుకు ఒక న్యాయ సంస్థ‌ను నియ‌మించింది.

అంతే కాకుండా బిల్ గేట్స్(Bill Gates) పై 2019 బోర్డు విచార‌ణ‌ను కూడా చేప‌ట్టింది. కాగా ప్ర‌స్తుతం మైక్రోసాఫ్ట్ కంపెనీకి సార‌థ్యం వ‌హిస్తున్న స‌త్య నాదెళ్ల ఎలా స్పందిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

ఇప్ప‌టికే ఆధారాలు లేకుండా ఓ వ్య‌క్తిపై లేనిపోని విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ‌దు అంటూ పేర్కొన్నారు. సంస్థ‌లో కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు ప‌ని చేసే వారంతా ఎప్ప‌టికీ సంస్థ నిర్దేశించిన నియ‌మావ‌ళిని పాటించాల్సిందే.

ఇందులో ఎలాంటి అనుమానం ఉండాల్సిన ప‌ని లేద‌న్నాడు స‌త్య నాదెళ్ల‌. మైక్రోసాఫ్ట్ ముందున్న పెను స‌వాల్ కో ఫౌండ‌ర్ గా ఉన్న బిల్ గేట్స్(Bill Gates) విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకో బోతుంద‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం ప్ర‌ధానంగా బిల్ గేట్స్ లైంగిక ఆరోప‌ణ‌ల‌తో పాటు లింగ వివ‌క్ష కు కూడా పాల్ప‌డ్డాడంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

పూర్తి విచార‌ణ నివేదిక వ‌చ్చాక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు మైక్రోసాఫ్ట్ సిఇఓ క‌మ్ చైర్మ‌న్ స‌త్య నాదెళ్ల‌. అంత దాకా వేచి చూసే ధోర‌ణి అవ‌లంభిస్తాంమ‌ని పేర్కొన్నారు.

మైక్రో సాఫ్ట్ బోర్డు ఆఫ్ డైరెక్ట‌ర్లు, మైక్రో సాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ల‌కు విచార‌ణ నివేదిక అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు స‌త్య నాదెళ్ల‌.

Also Read : ఎస్బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు తీపి క‌బురు

Leave A Reply

Your Email Id will not be published!