Manmohan Singh : మ‌న్మోహ‌న్ సింగ్ కు బ‌ర్త్ డే గ్రీటింగ్స్

శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ..రాహుల్

Manmohan Singh : మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ పుట్టిన రోజు ఇవాళ‌. దేశ వ్యాప్తంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్నారు ప్ర‌ముఖులు. సింగ్ కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ఎంపీ రాహుల్ గాంధీ.

మ‌న్మోహ‌న్ సింగ్ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని కోరుతున్నాన‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన నాయ‌కుల‌లో, ప్ర‌ధాన‌మంత్రుల‌లో డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్(Manmohan Singh) ఒక‌ర‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

న‌మ్ర‌త‌, అంకిత భావానికి పెట్టింది పేరు అని కొనియాడారు. సెప్టెంబ‌ర్ 26తో ఆయ‌న 90వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టారు. భార‌త దేశంలోని అత్యుత్త‌మ రాజ‌నీతిజ్ఞుల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందారు డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్.

ఆయ‌న నాకే కాదు కోట్లాది మంది భార‌తీయుల‌కు స్పూర్తిగా నిలుస్తార‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తాను చూసిన నాయ‌కుల‌లో మ‌న్మోహ‌న్ సింగ్ ఒక‌ర‌ని కితాబు ఇచ్చారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు కేసీ వేణుగోపాల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. త‌క్కువ మాట్లాడి ఎక్కువ ప‌నులు చేసిన అరుదైన నాయ‌కుడు, దిగ్గ‌జ ఆర్థిక‌వేత్త అని పేర్కొన్నారు.

స్వ‌యం ప్ర‌తిప‌త్తితో దేశం న‌డిచేలా చేసిన వ్య‌క్తి అని పేర్కొన్నారు. భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jaishankar) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అద్భుత‌మైన ప్ర‌తిభా సంప‌త్తి క‌లిగిన రాజ‌కీయ, ఆర్థిక వేత్త డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ అని కితాబు ఇచ్చారు.

Also Read : వ‌ర‌ల్డ్ టాప్ ఎయిర్ లైన్స్ ల‌లో ‘విస్తారా’

Leave A Reply

Your Email Id will not be published!