Somu Veerraju : బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి సోము
ప్రకటించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
Somu Veerraju : భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంచలన ప్రకటన చేసింది. పార్టీ జాతీయ కార్యవర్గంలోకి ఇద్దరికి చోటు కల్పించింది. తెలంగాణ పార్టీ చీఫ్ గా ఉన్న బండిని తొలగించి కార్యవర్గ సభ్యుడిగా తీసుకుంది. ఇదే సమయంలో ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును(Somu Veerraju) జాతీయ కార్య వర్గంలోకి ఎంపిక చేసింది.
ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఆయన స్థానంలో గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన దివంగత ఉమ్మడి ఏపీ సీఎం నందమూరి తారక రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరికి పార్టీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించింది.
దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికలు జరగనున్న దృష్ట్యా పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది కర్ణాటకలో. అధికారంలో ఉన్న కాషాయ పార్టీ సర్కార్ ను కన్నడ ప్రజలు దెబ్బ కొట్టారు. ఇదే సమయంలో తమిళనాడులో జోరు పెంచి, తెలంగాణలో పవర్ లోకి రావాలని చూస్తోంది బీజేపీ. ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామేనని చెప్పే ప్రయత్నం చేస్తోంది.
ఏపీలో వైసీపీ హవాను , సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తట్టుకుని నిలబడేందుకు పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించింది పార్టీ.
Also Read : Bandi Sanjay : బండి సంజయ్ కి కీలక పదవి