BJP BC CM : హైదరాబాద్ – తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా బీసీ నినాదం ప్రచార అస్త్రంగా మారింది. ఇందుకు శ్రీకారం తొలుత చుట్టింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి సంబంధించి గతంలో బీసీకి చెందిన వ్యక్తి పీఎంగా కొలువు తీరాడని, ఇక బీసీలకు రాజ్యాధికారం తప్పక వస్తుందని జోరుగా ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగారు. కేంద్ర కేబినెట్ లో కూడా బీసీలకు సముచిత ప్లేస్ ఇచ్చేలా చూశారు. తాజాగా తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.
BJP BC CM Viral in Telangana
రాష్ట్రంలో బీజేపీ డిసైడ్ ఫ్యాక్టర్ కావాలని, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేలా చూడాలని పార్టీ హైకమాండ్ భావించింది. ఇందులో భాగంగా సౌమ్యుడైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డికి బీజేపీ(BJP) చీఫ్ బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో పవన్ కళ్యాన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు ఉండేలా చూస్తోంది.
ఇక తెలంగాణలో ప్రస్తుతం తమ పార్టీని గెలిపిస్తే తప్పకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే సీఎం పదవి ఇస్తామని ప్రకటించారు ప్రధాన మంత్రి మోదీ. బీసీ సంఘాల నేతలతో జరిగిన కీలక భేటీలో బీజేపీకి సపోర్ట్ దేదో ఈటలకు సీఎం బనాదో అని ప్రకటించడం కలకలం రేపుతోంది.
Also Read : Pawan Kalyan : పవన్ కు మోదీ పలకరింపు