Annamalai : తమిళనాడు రాష్ట్రంలో పుర, స్థానిక ఎన్నికల్లో గణనీయమైన ఓట్ల శాతం పొందడంపై భారతీయ జనతా పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. గతంలో అన్నాడీఎంకేతో కలిసి సర్కార్ ను ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి విడి విడిగా బరిలోకి దిగాయి.
విచిత్రం ఏమిటంటే అన్నాడీఎంకేను దాటి బీజేపీ రెండో స్థానంలోకి చేరింది. ఇక ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అన్నాడీఎంకే కోటాలో కూడా డీఎంకే పాగా వేయడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలలో మునిగి పోయారు.
మరో వైపు బీజేపీ కూడా సంతోషంతో ఉప్పొంగి పోతోంది. ఇవాళ స్థానిక, పుర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చాలా వాటికి రిజల్ట్స్ ప్రకటించారు కూడా.
తమ పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారనేందుకు ఓట్ల శాతం పెరగడమేనని పేర్కొన్నారు బీజేపీ తమిళనాడు పార్టీ చీఫ్ అన్నామలై(Annamalai ).
ఈ ఎన్నికలలో తాము అత్యధికంగా సీట్లు గెలవక పోయినా ప్రజల్లోకి చొచ్చు కు పోగలిగామని ఇదే తమ అతి పెద్ద విజయమని అభివర్ణించారు.
అర్బన్, స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం అన్నామలై మీడియాతో మాట్లాడారు. అయితే ఆయన అధికారంలో ఉన్న డీఎంకేపై నిప్పులు చెరిగారు.
ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని లేక పోతే అన్ని సీట్లు రావని ఆరోపించారు. దీనిని తేలిగ్గా తీసుకున్నారు డీఎంకే శ్రేణులు.
ఈ విషయంపై తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు అన్నామలై(Annamalai ). తమిళనాడులో బీజేపీ మూడో పార్టీగా అవతరించింది.
మా అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులు, నాయకులకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు.
Also Read : రాష్ట్రపతి రేసులో నితీష్ కుమార్