Lalu Prasad Yadav : బీజేపీని తుడిచి పెట్టేస్తాం – లాలూ
లోక్ సభ ..అసెంబ్లీ ఎన్నికల్లో క్లోజ్
Lalu Prasad Yadav BJP : ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. 2024లో దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో, 2025లో రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో తమ కూటమి గెలుపొందడం ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తుడిచి పెట్టుకుని పోవడం తప్పదన్నారు లాలూ ప్రసాద్ యాదవ్. సింగపూర్ లో ఇటీవలే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం దేశానికి వచ్చారు. ఆర్జేడీకి చెందిన మహా కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది.
ఈ సందర్భంగా జరిగిన సభలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రసంగించారు. కాషాయ పార్టీని, దాని అనుబంధ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మితవాద పార్టీ దేశాన్ని కుల, మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నం చేస్తోందంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. దేశంలోని మైనార్టీలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని అన్నారు. కాషాయ, హిందుత్వ సంస్థలు రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఉన్నాయని , రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు
మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav BJP). తమ పోరాటం ఆర్ఎస్ఎస్ భావ జాలంతో అన్నారు. ప్రస్తుతం మోదీని అదానీ కంట్రోల్ చేస్తున్నాడని , బీజేపీని ఆర్ఎస్ ఎస్ మ్యానేజ్ చేస్తోందని మండిపడ్డారు. బీహార్ చొరవ తీసుకుందని , బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ వచ్చే ఎన్నికల్లో క్లోజ్ కావడం ఖాయమన్నారు. ఈ సందర్బంగా నా కూతురుకు రుణపడి ఉన్నాను అని అన్నారు లాలూ ప్రసాద్ యాదవ్.
Also Read : ద్వేష పూరిత నేరాలపై ఉక్కుపాదం