Tej Pratap Yadav : బీజేపీ వంతెన‌ను కూల్చేసింది – తేజ ప్ర‌తాప్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన బీహార్ మంత్రి

Tej Pratap Yadav : బీహార్ లో గంగా న‌దిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఉన్న‌ట్టుండి కూలి పోయింది. ఇది కూలి పోవ‌డం రెండోసారి. దీని కోసం ఏకంగా రూ. 1,700 కోట్లు ఖ‌ర్చు చేసింది. దీనికి బాధ్య‌త వ‌హించిన నిర్మాణ కంపెనీకి నోటీసు జారీ చేసింది. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఇంజ‌నీర్ ను స‌స్పెండ్ చేసింది. వంతెన కూలి పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బీహార్ అవినీతి ప్ర‌భుత్వం అంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆరోపించింది. దీనిపై తీవ్రంగా స్పందించారు మంత్రి తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్(Tej Pratap Yadav).

త‌మ ప్ర‌భుత్వంపై కేంద్రం క‌క్ష క‌ట్టింద‌ని, అందుకే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక భావ‌న వ‌చ్చేందుకు గాను ఈ బ్రిడ్జిని బీజేపీ కూల్చేసిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం తేజ ప్ర‌తాప్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. మేము నిర్మిస్తుంటే వాళ్లు కూల్చి వేసేందుకు య‌త్నిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎవ‌రైనా బ్రిడ్జి కూలి పోయేందుకు య‌త్నిస్తారా అంటూ ప్ర‌శ్నించారు మంత్రి.

ఇదిలా ఉండ‌గా భాగ‌ల్ పూర్ లో గంగా న‌దిపై నిర్మాణంలో ఉన్న నాలుగు లేన్ల వంతెన కూలి పోయేందుకు కాషాయ పార్టీనే కార‌ణ‌మ‌ని మ‌రోసారి నిప్పులు చెరిగారు. వంతెన కూలి పోయిన నాటి నుండి బీజేపీ వ‌ర్సెస్ జేడీయూ, ఆర్ఎల్డీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరింది. ఒక‌రిపై మ‌రొక‌రు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసుకుంటూ ర‌క్తి క‌ట్టిస్తున్నారు. మంత్రి చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండించింది బీజేపీ.

Also Read : Centre Release : పోల‌వ‌రంకు రూ. 12,911 కోట్లు మంజూరు

 

Leave A Reply

Your Email Id will not be published!