Akhilesh Yadav : బీజేపీ..కాంగ్రెస్ ఒక్క‌టే – అఖిలేష్ యాద‌వ్

రాహుల్ గాంధీ యాత్ర‌పై కామెంట్స్

Akhilesh Yadav : స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో పాల్గొనాల‌ని మీకు ఆహ్వానం అందిందా అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న భిన్నంగా స్పందించారు. మా పార్టీది భిన్న‌మైన సిద్దాంత‌మ‌ని స్ప‌ష్టం చేశారు. రెండు పార్టీలు ఒక్క‌టేన‌ని, వాళ్ల‌కు అధికారం మాత్రం కావాల‌ని, బ‌హుజ‌నులు, మైనార్టీలు, నిమ్న వ‌ర్గాల‌ను ప‌ట్టించు కోర‌ని ఆరోపించారు.

గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌కు ఆహ్వానం అంద‌లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు స‌ల్మాన్ ఖుర్షీద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు రాహుల్ గాంధీ చేప‌ట్టే యాత్ర‌కు యూపీలోని అన్ని పార్టీల నేత‌ల‌ను ఆహ్వానం ఇస్తామ‌ని తెలిపారు.

కాగా సీపీఎం సీనియర్ నాయ‌కుడు సీతారాం ఏచూరి కూడా త‌న‌కు ఇంత వ‌ర‌కు ర‌మ్మ‌ని పిల‌వ‌లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ తిరిగి ప్రారంభించ‌బోయే భార‌త్ జోడో యాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాహుల్ గాంధీ తొమ్మిది రాష్ట్రాల‌లో త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకున్నారు.

సెప్టెంబ‌ర్ 6న త‌మిళ‌నాడు లోని క‌న్యాకుమారి నుంచి యాత్ర‌ను స్టార్ట్ చేశారు. అక్క‌డి నుంచి కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్ , తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్ , హ‌ర్యానాలో యాత్ర పూర్తయింది. ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ను ఉద్దేశించి రాహుల్ ప్ర‌సంగించారు.

త‌న‌కు ఎటువంటి ఇన్విటేష‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌న్నారు అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav). ఒక వేళ మీ ఫోన్ లో ఉంటే నాకు పంపండి అని కోరారు.

Also Read : అరెస్టుల ప‌ర్వం ప‌వార్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!