Sanjay Raut : బీజేపీ కుట్రలు ఫలించవు – సంజయ్ రౌత్
సూరత్ లో ఎమ్మెల్యేల్ని బంధించారు
Sanjay Raut : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు శివసేన పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut). బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా, కుట్రలు చేసినా మరాఠాలో ఆ పార్టీకి అంత సీన్ లేదన్నారు.
ఇప్పటికే బీజేపీయేతర ప్రభుత్వాల్ని, పార్టీలను, వ్యక్తులను టార్గెట్ గా చేసుకుంటూ వస్తున్నారని ఆరోపించారు. దీనిని ఎదుర్కోవడం తమకు మామూలేనని పేర్కొన్నారు.
కొందరి మాయ మాటల వల్ల మా మంత్రి ఏక్ నాథ్ షిండే కొంచెం విని ఉండవచ్చని, అంత మాత్రం వల్ల ప్రభుత్వం కూలి పోయే ప్రసక్తి లేదన్నారు. మేం మహా వికాస్ అఘాడిగా ఏర్పడిన నాటి నుంచి సర్కార్ ను టార్గెట్ చేస్తూ వచ్చింది కేంద్రం.
కానీ తట్టుకుని నిలబడ్డం. కానీ ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.
ఇది రాష్ట్ర ప్రజలకే కాదు దేశానికి కూడా తెలుసు. ఇందులో ఎవరి పాత్ర ఏమిటన్నది కాలమే సమాధానం చెబుతుందన్నారు సంజయ్ రౌత్. ఇదిలా ఉండగా మంత్రి ఏక్ నాథ్ షిండే తో పాటు 21 మంది ఎమ్మెల్యేలను తీసుకు వెళ్లారు.
ఆయనతో పాటు వారంతా గుజరాత్ లోని సూరత్ హోటల్ లో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలతో తాను మాట్లాడానని వారంతా బయటకు వచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు.
అయితే కుట్రలకు తెర తీసిన బీజేపీ నేతలు వారిని రాకుండా అడ్డుకుంటున్నారని సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన ఆరోపణలు చేశారు. షిండేను ఉపయోగించి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ఫలించవన్నారు.
షిండే పార్టీకి నమ్మకమైన కార్యకర్త. ఆయన మాతో కలిసి ఎన్నోసార్లు ఆందోళనల్లో పాల్గొన్నాడని చెప్పారు ఎంపీ. అతను బాలా సాహెబ్ సైనికుడని అన్నారు.
Also Read : శివసేన చీఫ్ విప్ నుంచి షిండే తొలగింపు