BJP Fire Police : ఖాకీల తీరుపై కాషాయ నేతల కన్నెర్ర
పాసులున్నా నో పర్మిషన్
BJP Fire Police : విజయ సంకల్ప్ పేరుతో శనివారం ఓరుగల్లులో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సభకు ఊహించని రీతిలో షాక్ తగిలింది బీజేపీ(BJP) నేతలకు. సీనియర్లను కూడా పోలీసులు సభా వేదిక వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వ లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అడుగడుగునా ఖాకీలు ఉండడంతో చాలా మంది వెళ్లలేక బయటే నిల్చుండి పోయారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా పోలీసులు మోహరించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. చాలా మంది సభ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినా ఫలించ లేదు. మోదీ కోసం భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి.
10,000 వేల మంది మోహరించారు. 3,500 మంది ఆర్మీ ,కేంద్ర రక్షణ దళాలు కొలువు తీరాయి. మొత్తంగా హన్మకొండ సభా ప్రాంగణం పూర్తిగా ఖాకీల నీడలోకి వెళ్లింది. మరో వైపు వరంగల్ కు చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్రీ జోన్ గా ప్రకటించారు. మోదీ వెళ్లేంత వరకు ఖాకీలు పర్యవేక్షించారు.
ఇదిలా ఉండగా పలువు సీనియర్లకు భంగపాటు కలిగింది. ప్రేమేందర్ రెడ్డిని సైతం అడ్డుకున్నారు. ఆయన ఎంత మొత్తుకున్నా పట్టించు కోలేదు. పర్మిషన్ లేదంటూ గేట్లకు తాళం వేశారు. పాసులు ఉన్నా పర్మిషన్ ఇవ్వలేదు. పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు ఖాకీల తీరుపై ఫైర్ అయ్యారు.
Also Read : YS Vijayamma : వైఎస్సార్ కు మరణం లేదు – విజయమ్మ
