BJP Focus : ఎన్నికలపై నజర్ బీజేపీ ఫోకస్
సీనియర్లకు పీఎం మోదీ దిశా నిర్దేశం
BJP Focus : ప్రధాన మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలు, సీనియర్లకు హిత బోధ చేశారు. ఒక రకంగా ఆయన దిశా నిర్దేశం చేశారని చెప్పక తప్పదు.
ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మంత్రుల మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్ కు పీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, సీనియర్ నాయకులు ,పార్టీ చీఫ్ కూడా పాల్గొన్నారు. విపక్షాలు ఓ వైపు మనల్ని తూర్పార బడుతున్నాయి. ఆ విమర్శలు, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఇప్పటికే సర్వేలు పూర్తిగా భారతీయ జనతా పార్టీ(BJP) గెలుస్తాయని ప్రకటించాయని, కానీ గతంలో వచ్చిన సీట్ల కంటే అధికంగా రావాలని ఇందుకు ఆయా రాష్ట్రాల చీఫ్ లు, బాధ్యతులు, ఇన్ఛార్జీలపై ఉందని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
Also Read : BJP Appoints : రాష్ట్రాలకు బీజేపీ కొత్త చీఫ్ లు
