BJP Focus : ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లపై బీజేపీ ఫోక‌స్

సంస్థాగ‌త మార్పుల‌కు మోదీ శ్రీ‌కారం

BJP Focus : త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ భార‌తీయ జ‌న‌తా పార్టీ సోమవారం భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్ పేరుతో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు బీజేపీ ఎలాగైనా స‌రే కాషాయ జెండా ఎగుర వేయాల‌ని డిసైడ్ అయ్యింది. ఇటీవ‌లే క‌ర్నాట‌క‌లో కొలువు తీరిన బీజేపీ(BJP) ప్ర‌భుత్వాన్ని కోల్పోయింది.

ఇది ఊహించ‌ని షాక్ ఆ పార్టీకి. ద‌క్షిణాదిలో పాగా వేయాల‌ని ఫోక‌స్ పెట్టింది. ప్ర‌ధాని మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా సైతం పెద్ద ఎత్తున అన్నీ తామై ప్ర‌చారం చేశారు. సంస్థాగ‌తంగా మార్పులు చేసేందుకు పార్ణీ నిర్ణ‌యించింది. ఈ కీల‌క స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా కూడా హాజ‌రు కావ‌డం విశేషం. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

తెలంగాణ‌లో ఎలాగైనా స‌రే బీజేపీ పాగా వేయాల‌ని అనుకుంది. కానీ ఇప్ప‌టికే పార్టీలో లుక‌లుక‌లు ఆ పార్టీకి త‌ల‌నొప్పిగా మారాయి. ఆ పార్టీ చీఫ్ బండి సంజ‌య్ పై ఈట‌ల రాజేంద‌ర్ , రాజ‌గోపాల్ రెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు సైతం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పార్టీ నాయ‌క‌త్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : Raghunandan Rao : బండికి అన్ని కోట్లు ఎక్క‌డివి

 

Leave A Reply

Your Email Id will not be published!