BJP Fourth List : బీజేపీ నాలుగో లిస్టు డిక్లేర్
మేడ్చల్ నుంచి రామచంద్రరావు
BJP Fourth List : హైదరాబాద్ – ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత లిస్టును భారతీయ జనతా పార్టీ(BJP) ఖరారు చేసింది. రాష్ట్రంలో తామే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని ప్రకటించింది. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ చీఫ్ గా ఉన్న జనసేన పార్టీతో.
BJP Fourth List Released
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ కు ఛాన్స్ ఇచ్చింది. ప్రముఖ లాయర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు కు మేడ్చల్ నియోజకవర్గాన్ని కేటాయించింది పార్టీ. నాంపల్లిలో రాహుల్ చంద్ర, శేరిలింగం పల్లిలో రవి కుమార్ యాదవ్ , పెద్దపల్లిలో ప్రదీప్ కుమార్ , సంగారెడ్డి నుంచి రాజును ఎంపిక చేసింది.
ఈ విషయాన్ని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, సీబీఐ, ఈడీ తమ పరిధిలో ఉండవన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి అంటూ బద్నాం చేయడం మంచి పద్దతి కాదన్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, త్వరలో జరిగే ఎన్నికల్లో అది ప్రతిఫలిస్తుందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.
Also Read : Congress Fourth List : అద్దంకికి షాక్ శామ్యూల్ కు ఛాన్స్