Rahul Gandhi : బీజేపీకి బలం ఉంది శక్తి లేదు – రాహుల్
నిప్పులు చెరిగిన ఏఐసీసీ మాజీ చీఫ్
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కేంద్ర సర్కార్ ను, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని, దాని అనుబంధ సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
తనను డీ మోరలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ తాను తట్టుకుంటూ నిలబడ్డానని చెప్పారు. తాను భారత్ జోడో యాత్రలో నడుస్తున్నప్పుడు తమకు ఎలాంటి శక్తి లేదని చెప్పారు. మాకు వ్యతిరేకంగా తీవ్రమైన స్థాయిలో బలం మరో వైపు ఉందన్నారు రాహుల్ గాంధీ.
కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి పోలీసులు, సంస్థలు , మీడియా, సోషల్ మీడియా అంతా మోదీ కనుసన్నలలో ఉన్నాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా మోడీ ప్రభుత్వం వద్ద ఉన్న శక్తి అంతా ఏమీ చేయలేక పోయిందంటూ ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. వారు ఎంత ఎక్కువ శక్తిని ప్రయోగించడానికి ప్రయత్నించారో అది తక్కువ పని చేస్తుందన్నారు.
ఆ విషయం మోదీ గమనించడం లేదన్నారు. ఆయనను మోస్తున్న మీడియా కూడా గుర్తించడం లేదని మండిపడ్డారు. సత్యానికి దగ్గరగా వస్తే శక్తి అదంతట అదే వస్తుందన్నారు. వారికి బలం ఉంది. కానీ శక్తి లేదన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్.
Also Read : Tamilisai Soundara Rajan